Loading...
Bhagwant Mann: 'మా పొగ పాకిస్థాన్‌కు వెళ్తోందా?'పంజాబ్‌ను అప్రతిష్ఠపాలు చేస్తున్నారు.. భగవంత్ మాన్ విమర్శలు
పంజాబ్‌ను అప్రతిష్ఠపాలు చేస్తున్నారు.. భగవంత్ మాన్ విమర్శలు

Bhagwant Mann: 'మా పొగ పాకిస్థాన్‌కు వెళ్తోందా?'పంజాబ్‌ను అప్రతిష్ఠపాలు చేస్తున్నారు.. భగవంత్ మాన్ విమర్శలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2026
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీలో వాయు కాలుష్యానికి పంజాబ్‌లో పంట వ్యర్థాలను తగలబెట్టడమే కారణమన్న ఆరోపణలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఖండించారు. పంజాబ్‌ను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రశ్నించారు. హరియాణాలోనూ వరి సాగు జరుగుతోందని,అక్కడ కూడా పంట వ్యర్థాలను తగలబెడుతున్నారని గుర్తుచేశారు. శుక్రవారం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పంజాబ్ నుంచి వచ్చే పొగ ఢిల్లీకి చేరాలంటే ప్రత్యేకమైన గాలి పరిస్థితులు ఉండాలని మాన్ అన్నారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం నుంచి పడమర దిశగా గాలులు వీస్తేనే పొగ ఢిల్లీకి చేరే అవకాశం ఉంటుందని చెప్పారు. అలా జరిగినా ఢిల్లీకి చేరుకోవడానికి మూడు రోజులు పడుతుందని వ్యాఖ్యానించారు.

వివరాలు 

మంజీందర్ సింగ్ సిర్సా వ్యాఖ్యలపైనా మాన్ అభ్యంతరం

పంజాబ్ పొగ పాకిస్థాన్‌లోని లాహోర్‌కు కూడా చేరుతోందా? అని విలేకరులు ప్రశ్నించగా.. 'మా పొగ పాకిస్థాన్‌కు కూడా వెళ్తోందా?' అంటూ వ్యంగ్యంగా స్పందించారు.

ఢిల్లీకి సమీపంలో ఉన్న ఘజియాబాద్, హరియాణాలోనూ వరి సాగు జరుగుతోందని, కాలుష్యానికి కారణాలను విశ్లేషించేటప్పుడు వీటినీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ఢిల్లీ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా చేసిన వ్యాఖ్యలపైనా మాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

పంజాబ్‌లో వరి కోతల సీజన్ ప్రారంభం కాకముందే అక్కడి నుంచి పొగ ఢిల్లీకి చేరుతోందని సిర్సా ఆరోపించారని అన్నారు.

ఇవన్నీ పంజాబ్‌ను అప్రతిష్ఠపాలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలని విమర్శించారు. 'ఇదంతా పంజాబ్ పేరును చెడగొట్టే ప్రయత్నం మాత్రమే' అని వ్యాఖ్యానించారు.

వివరాలు 

ఫిరోజ్‌పుర్, తరన్‌తారన్, సంగ్రూర్ జిల్లాల్లో అత్యధిక ఘటనలు

మరోవైపు పంజాబ్‌లో పంట వ్యర్థాలను తగలబెట్టిన ఘటనలు పెరుగుతున్నాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పొలాల్లో మంటల ఘటనల సంఖ్య 5,517కు చేరింది.

ఫిరోజ్‌పుర్, తరన్‌తారన్, సంగ్రూర్ జిల్లాల్లో అత్యధిక ఘటనలు నమోదయ్యాయి.

ప్రభుత్వ సూచనలను పట్టించుకోకుండా పలువురు రైతులు పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు.

మంగళవారం ఒక్కరోజే 345 ఘటనలు నమోదవడంతో మొత్తం సంఖ్య 5,002కు చేరింది.

బుధవారం మరోసారి పెరిగి 5,517కు చేరినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

ఫిరోజ్‌పుర్‌లో అత్యధికంగా 728, తరన్‌తారన్‌లో 687, సంగ్రూర్‌లో 628, భటిండాలో 499 ఘటనలు నమోదయ్యాయి.

సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 9 వరకు రాష్ట్రంలో మొత్తం 4,657 పంట వ్యర్థాల దహనం ఘటనలు నమోదయ్యాయి.

ADVERTISEMENT

వివరాలు 

రైతుల భూముల రికార్డుల్లో 1,637 రెడ్ ఎంట్రీలు

ఈ కేసుల్లో పర్యావరణ పరిహారం కింద రూ.85 లక్షలకు పైగా జరిమానాలు విధించారు.

మొత్తం 1,695 కేసుల్లో జరిమానాలు విధించగా.. ఇప్పటివరకు రూ.37 లక్షలకు పైగా వసూలు చేశారు.

ఇదే సమయంలో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 223 కింద 1,259 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.

ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఈ కేసులు పెట్టారు.

పంట వ్యర్థాలను తగలబెట్టిన రైతులకు చెందిన భూముల రికార్డుల్లో అధికారులు 1,637 రెడ్ ఎంట్రీలు కూడా నమోదు చేశారు.

ఈ ఎంట్రీలు ఉన్న రైతులు తమ వ్యవసాయ భూములపై రుణాలు పొందడం, వాటిని విక్రయించడం సాధ్యం కాదు.

ADVERTISEMENT