Page Loader
Nitish-Modi: మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించిన బిహార్ సీఎం నీతీశ్‌.. వీడియో వైరల్
మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించిన బిహార్ సీఎం నీతీశ్‌.. వీడియో వైరల్

Nitish-Modi: మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించిన బిహార్ సీఎం నీతీశ్‌.. వీడియో వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2024
03:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌ దర్భంగాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన ఓ కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ప్రధాని మోదీ పాదాలకు నమస్కారం చేయాలనుకోవడంతో, ప్రధాని ఆయన్ను ఆపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పాపులర్‌ అయ్యింది. నితీష్‌ ప్రధాని పాదాలకు నమస్కారం చేయడానికి ప్రయత్నించిన ఇది మూడోవ ఘటన. జూన్‌లో పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో, అలాగే లోక్‌సభ ఎన్నికల సమయంలో నవాదాలో జరిగిన సమావేశంలోనూ నితీష్ ఇలానే వ్యవహారించారు.

Details

నితీష్ పై మోదీ ప్రశంసలు

దర్భంగా కార్యక్రమంలో మోదీ రూ.12,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు, ఎయిమ్స్‌ శంకుస్థాపనలో పాల్గొన్న సందర్బంగా, బిహార్‌కు మోదీ ప్రత్యేక ప్రస్తావన ఇచ్చారు. రాష్ట్రాన్ని 'జంగిల్‌ రాజ్‌' నుంచి క్రమంగా మార్చడానికి నితీష్ చేసిన కృషిని ప్రశంసించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాళ్లు మొక్కే ప్రయత్నం చేసిన నితీష్