Page Loader
Rs.100 crores road: రూ.100 కోట్లు ఖర్చు చేసి రోడ్డు.. కానీ రోడ్డుకి మధ్యలో చెట్లు వదిలేశారు! 
రూ.100 కోట్లు ఖర్చు చేసి రోడ్డు.. కానీ రోడ్డుకి మధ్యలో చెట్లు వదిలేశారు!

Rs.100 crores road: రూ.100 కోట్లు ఖర్చు చేసి రోడ్డు.. కానీ రోడ్డుకి మధ్యలో చెట్లు వదిలేశారు! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2025
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ రాష్ట్రంలోని పట్నా-గయా ప్రధాన రహదారిపై ఉన్న జహానాబాద్‌లో తాజాగా సుమారు 7.48 కిలోమీటర్ల పొడవులో కొత్త రోడ్డు నిర్మించారు. ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో భారీ వ్యయంతో ఈ పనులు చేపట్టారు. అయితే ఈ రోడ్డులో ఒక విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రహదారి ఇరుపక్కల ఉండే చెట్లు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని కలిగించేవిగా ఉంటాయి. కానీ ఇక్కడ వాస్తవం భిన్నంగా ఉంది. ఇక్కడ మధ్యలో ఉన్న చెట్లను అలానే ఉంచి రోడ్డు వేశారు. ఈ నిర్మాణానికి ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేశారు. కానీ రహదారి మధ్యలో ఉన్న చెట్లను తొలగించకుండా, అవి ఉన్నవిధంగా ఉంచి చుట్టూ రోడ్డు వేసారు.

వివరాలు 

ప్రతిఫలంగా 14 హెక్టార్ల అటవీ భూమి

ఇది ప్రయాణికుల భద్రతకు పెనుముప్పుగా మారే అవకాశం ఉంది. అది ప్రయాణానికి ఎంత భయానకమో ఒక్కసారి ఊహించుకోండి. రహదారి విస్తరణ పనుల సమయంలో, జిల్లా యంత్రాంగం చెట్లను తొలగించేందుకు అనుమతి కోరింది. అయితే అటవీశాఖ దీనికి ఒప్పుకోలేదు. చెట్లు తొలగించాలంటే ప్రతిఫలంగా 14 హెక్టార్ల అటవీ భూమిని పరిహారంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను జిల్లా యంత్రాంగం నెరవేర్చలేకపోయింది. దాంతో, చెట్లను తియ్యకుండా , అవి ఉన్నచోట వదిలిపెట్టిన పరిస్థితిలోనే రోడ్డును నిర్మించినట్లు తెలుస్తోంది.