Karnataka: మితిమీరిన వేగంతో వచ్చి.. బైక్, విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు
కర్ణాటకలో మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి కారు బైక్‌ను, ఇద్దరు విద్యార్థినులను బలంగా ఢీకొట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జులై 18న రాయచూర్ జిల్లాలో రద్దీగా ఉండే రాఘవేంద్ర పెట్రోల్ బంకు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైకర్ యూటర్న్ తీసుకుంటుండగా వేగంగా దూసుకొచ్చిన కారు, అతని ఢీకొట్టింది. అనంతరం అదుపు తప్పిన కారు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లతున్న విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైకర్‌కు తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు విద్యార్థినులకు స్వల్పంగా గాయాలయ్యాయి. రాయచూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కారు యజమానిపై కేసు నమోదు చేశారు.