Page Loader
అతితీవ్ర తుపానుగా బిప‌ర్‌జాయ్.. తీత‌ల్ బీచ్‌ మూసివేత
అతితీవ్ర తుపానుగా మారనున్న బిప‌ర్‌జాయ్.. తీత‌ల్ బీచ్‌ మూసివేత

అతితీవ్ర తుపానుగా బిప‌ర్‌జాయ్.. తీత‌ల్ బీచ్‌ మూసివేత

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 10, 2023
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

'బిప‌ర్‌జాయ్' అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందిన నేపేథ్యంలో గుజ‌రాత్ వ‌ల్సాద్‌లోని తీత‌ల్ బీచ్‌లో రాకాసి అల‌లు ఎగిసిప‌డుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు బీచ్‌ను వెంటనే మూసివేశారు. తొలుత మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క దిశ‌గానే పయణించిన తుపాను ఇప్పుడు గుజ‌రాత్ మీదుగా పాకిస్థాన్‌లోకి ప్ర‌వేశించనుంది. రానున్న 24 గంట‌ల్లో మ‌రింత ఉగ్రరూపం దాల్చ‌ే అవకాశం ఉందని భారత వాతావారణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈ క్రమంలో తుపాను ఈశాన్యం దిశగా క‌దులుతున్న‌ట్లు తెలిపింది. తీత‌ల్ బీచ్‌ను జూన్ 14 వ‌ర‌కు మూసివేసిన అధికారులు, మ‌త్స్య‌కారులు స‌ముద్రంలో చేప‌ల వేట‌కు వెళ్ల‌రాదని హెచ్చరించారు. అరేబియా సముద్రంలో తీర ప్రాంత ప్ర‌జ‌ల‌ను సేఫ్ జోన్లకు త‌ర‌లించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారి కోసం పునరావాస కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post