Page Loader
మణిపూర్ ఘటనపై మోదీకి ఖర్గే చురకలు..అసమర్థ సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండ్
అసమర్థ సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండ్

మణిపూర్ ఘటనపై మోదీకి ఖర్గే చురకలు..అసమర్థ సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 27, 2023
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మరోసారి ఫైరయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా మండిపడ్డారు. మణిపూర్ రణరంగానికి బీజేపీయే కారణమన్నారు. వెంటనే అసమర్థ సీఎంను తొలగించాలని డిమాండ్ చేశారు. గత 147 రోజులుగా మణిపూర్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రధానికి బాధిత రాష్ట్రాన్ని సందర్శించే అంత సమయం లేదని చురకలు అంటించారు. మణిపూర్ హింసలో విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న భయానక వీడియోలు మరోసారి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు. అల్లర్లలో మహిళలు, పిల్లలే బాధితులుగా మారుతున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సీఎం బీరేన్ సింగ్ ను తక్షణమే భర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మణిపూర్ రణరంగంపై మోదీ, బీజేపీని ఏకిపారేసిన ఖర్గే