Page Loader
అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం.. ఆ 2 రాష్ట్రాల అభ్యర్థుల తొలి జాబితా విడుదల 
ఆ 2 రాష్ట్రాల అభ్యర్థుల తొలి జాబితా విడుదల

అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం.. ఆ 2 రాష్ట్రాల అభ్యర్థుల తొలి జాబితా విడుదల 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 17, 2023
06:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని 21 స్థానాలకు, మధ్యప్రదేశ్‌లోని 39 స్థానాలకు తొలి జాబితా ప్రకటించింది. మరికొద్ది నెలల్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తెలంగాణతో పాటు రాజస్థాన్ అభ్యర్థుల జాబితాను సెప్టెంబర్ లో జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(CEC) భేటీలో భాగంగా తొలి జాబితాను విడుదల చేయనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన బీజేపీ