ఛత్తీస్‌గఢ్ బీజేపీ కురువృద్ధుడు, మాజీ మంత్రి లీలారామ్ భోజ్వానీ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్‌గఢ్‌లో మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత లీలారామ్ భోజ్వానీ కన్నుమూశారు.
రాయ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని గురువారం పార్టీ ప్రకటించింది. 82 ఏళ్ల వయసున్న ఈ కురువృద్ధుడు ఉమ్మడి మధ్యప్రదేశ్‌లోనే కీలక నాయకుడిగా పేరు గడించారు.
ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, మాజీ సీఎం రమణ్ సింగ్ భోజ్వానీ ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
గురువారం అంత్యక్రియలు నిర్వహించన్నామని, ఈ క్రమంలోనే భౌతికకాయాన్ని రాజ్‌నంద్‌గావ్‌కు తరలించామని పేర్కొంది.
అంతిమయాత్ర మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన నివాసం నుంచి ప్రారంభమవుతుందని వివరించింది.
1990, 1998లో రాజ్‌నంద్‌గావ్ అసెంబ్లీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1990లో మధ్యప్రదేశ్ కార్మిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సీనియర్ బీజేపీ లీడర్ లీలారామ్ కన్నుమూత
अविभाजित मध्य प्रदेश के पूर्व मंत्री श्री लीलाराम भोजवानी जी के आकस्मिक निधन का समाचार दुखद है।
— Bhupesh Baghel (@bhupeshbaghel) August 17, 2023
भोजवानी जी का लंबा सार्वजनिक जीवन रहा है और उन्होंने पूरा जीवन आम जनता के लिए समर्पित होकर कार्य किया।
हम ईश्वर से दिवंगत आत्मा की शांति और शोकाकुल परिवारजनों को संबल प्रदान करने की…