Page Loader
2024 లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమి? 
2024 లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమి?

2024 లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమి? 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2023
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ,జనతాదళ్(సెక్యులర్)2024 లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో చేతులు కలపడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. జేడీ(ఎస్) అధినేత హెచ్‌డీ దేవెగౌడ ఇటీవల బీజేపీ చీఫ్ జేపీ నడ్డా,హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై కూటమి నిర్మాణంపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్ 1996,ఏప్రిల్ 1997 మధ్య ప్రధానిగా ఉన్న హెచ్‌డి దేవెగౌడ కర్ణాటకలో ఐదు లోక్‌సభ స్థానాలను కోరుతున్నారు. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోడీ తుది నిర్ణయం తీసుకుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరిన్ని చర్చలు పైప్‌లైన్‌లో ఉన్నప్పటికీ, దేవెగౌడ, హెచ్‌డి కుమారస్వామి జెడి (ఎస్) స్టేక్ హోల్డర్స్ ను కలిసిన తర్వాత మాత్రమే బిజెపితో ఈ ప్రతిపాదనను ముందుకు కదిలించినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా.

Details 

లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తాం: దేవెగౌడ 

జేడీ(ఎస్) నేతలు ఏకాభిప్రాయం (సీట్ షేరింగ్‌పై)ఇచ్చారని వర్గాలు ధృవీకరించాయి. JD(S) అడిగిన ఐదు లోక్‌సభ స్థానాలు మాండ్య,హాసన్,తుమకూరు,చిక్‌బల్లాపూర్,బెంగళూరు రూరల్. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎతో ఎన్నికల పొత్తును నిరాకరిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని జూలైలో దేవెగౌడ చెప్పిన కొన్ని నెలల తర్వాత ఈ చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మేం (పార్టీ) ఐదు,ఆరు,మూడు,రెండు లేదా ఒక సీట్లు గెలిచినా..లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తాం'' అని అప్పట్లో దేవెగౌడ చెప్పారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా,పార్టీ బలపరిచిన అభ్యర్థి కూడా విజయం సాధించారు. కాంగ్రెస్,జేడీ(ఎస్)లు ఒక్కో సీటును దక్కించుకున్నాయి.జేడీ(ఎస్)కంచుకోట హాసన్‌లో దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ విజయం సాధించారు.