Page Loader
Amar Kishore Bam Bam: ఏకంగా పార్టీ కార్యాలయంలో మహిళను కౌగిలించుకున్న బీజేపీ నేత.. నోటీసు జారీ
ఏకంగా పార్టీ కార్యాలయంలో మహిళను కౌగిలించుకున్న బీజేపీ నేత.. నోటీసు జారీ

Amar Kishore Bam Bam: ఏకంగా పార్టీ కార్యాలయంలో మహిళను కౌగిలించుకున్న బీజేపీ నేత.. నోటీసు జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2025
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడైన అమర్‌కిషోర్ బామ్ బామ్ ఓ మహిళా కార్యకర్తతో అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో ఆ మహిళతో కలిసి పార్టీ కార్యాలయానికి వచ్చిన బామ్ బామ్, కార్యాలయం మెట్ల వద్ద ఆమెను ఆలింగనం చేసుకుంటూ, అనంతరం ఆమెను గదిలోకి తీసుకెళ్తున్న దృశ్యాలు కార్యాలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఫుటేజ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం ఏర్పడింది.

వివరాలు 

ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోలను లీక్ చేస్తున్నారు: బామ్ బామ్

ఈ వీడియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీజేపీ నేత బామ్ బామ్ స్పందిస్తూ, వీడియోలో కనిపించిన వ్యక్తి తానేనని అంగీకరించారు. అయితే, ఆ మహిళా కార్యకర్త అనారోగ్యానికి గురవడంతో, ఆమె విశ్రాంతి తీసుకునేందుకు ఆఫీసులోకి తీసుకెళ్లానని, తన చర్య వెనుక మానవతా దృక్పథమే ఉందని వివరణ ఇచ్చారు. ఇదంతా తనను పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలన్న కుట్ర భాగమని ఆరోపించిన ఆయన, కొన్ని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోలను లీక్ చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

వివరాలు 

మధ్యప్రదేశ్‌లో కూడా ఈ తరహా ఘటన 

ఇది మాత్రమే కాకుండా, రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో కూడా ఓ బీజేపీ నేత మహిళతో రోడ్డుమీదే అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో బహిర్గతమైంది. వరుసగా ఇలాంటి ఆరోపణలు బీజేపీ నేతలపై రావడం, పార్టీ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా గోండా ఘటనపై పార్టీ కేంద్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. వెంటనే సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళల గౌరవాన్ని హరించే విధంగా బహిరంగ ప్రదేశాల్లో జరుగుతున్న ఈ ఘటనలు, రాజకీయాల్లో నైతికత, బాధ్యత అనే అంశాలపై సంశయాలను కలిగిస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు