Page Loader
Delhi New CM: ఢిల్లీ కొత్త సీఎం ఎవరు? ఫిబ్రవరి 19న బీజేపీ శాసనసభా పక్ష సమావేశం 
Delhi New CM: ఢిల్లీ కొత్త సీఎం ఎవరు? ఫిబ్రవరి 19న బీజేపీ శాసనసభా పక్ష సమావేశం

Delhi New CM: ఢిల్లీ కొత్త సీఎం ఎవరు? ఫిబ్రవరి 19న బీజేపీ శాసనసభా పక్ష సమావేశం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2025
08:34 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయాన్ని సాధించినప్పటికీ, కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. అయితే, ఈ అనిశ్చితికి ఫిబ్రవరి 19 ముగింపు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కీలకమైన బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్ష నేతను ఎంపిక చేసేందుకు ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి పదవికి పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ, రేఖా గుప్తా తదితరుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

వివరాలు 

మాజీ సీఎం విజయం

దీనిపై త్వరలో స్పష్టత వస్తుందని బీజేపీ ఎంపీ యోగేంద్ర చందోలియా వెల్లడించారు.ఒకటి రెండ్రోజుల్లో కీలకమైన సమావేశం జరగనున్నట్లు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి ఎంపికపై స్పష్టత రానుందని తెలిపారు. 27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఫిబ్రవరి 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 స్థానాల్లో గెలిచింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఈసారి కేవలం 22 స్థానాలకు పరిమితమైంది. ఆ పార్టీ ముఖ్యనేత అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలువురు కీలక నేతలు ఓటమి పాలయ్యారు. అయితే, మాజీ సీఎం అతిషి మాత్రం విజయం సాధించింది.