Page Loader
అనారోగ్యంతో బీజేపీ ఎంపీ రత్తన్ లాల్ కటారియా కన్నుమూత
అనారోగ్యంతో బీజేపీ ఎంపీ రత్తన్ లాల్ కటారియా కన్నుమూత

అనారోగ్యంతో బీజేపీ ఎంపీ రత్తన్ లాల్ కటారియా కన్నుమూత

వ్రాసిన వారు Stalin
May 18, 2023
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, అంబాలా బీజేపీ ఎంపీ రత్తన్ లాల్ కటారియా(72) గురువారం కన్నుమూశారు. గత నెల రోజులుగా అనారోగ్యంతో కటారియా చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో పరిస్థితి విషమించడంతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కటారియాకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ ఓం ప్రకాష్ ధంకర్ సహా సీనియర్ బీజేపీ నేతలు కటారియా మృతి పట్ల తమ సంతాపాన్ని తెలిపారు. రత్తన్ లాల్ కటారియా మరణం హర్యానా రాజకీయాలకు తీరని లోటని ఖట్టర్ పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పీజీఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కటారియా కన్నుమూత