Lok Sabha 2024: రాహుల్ గాంధీతో వయనాడ్ లో తలపడే బీజేపీ అభ్యర్థి ఎవరంటే?
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) అధినేత రాహుల్ గాంధీ కేరళ బిజెపి (BJP) చీఫ్ కే.సురేంద్రన్‌తో వయనాడ్ నియోజకవర్గంలో తలపడనున్నారు. 2009 నుంచి కాంగ్రెస్ కు వాయనాడ్ కంచుకోటగా మారింది. 2019లో రాహుల్ గాంధీ రెండు స్థానాలు నుంచి పోటీ చేశారు. 2019లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో అమేథీ సీటును కోల్పోయి.. వాయినాడ్ నుంచి రాహుల్ గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో సురేంద్రన్ కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థిగా పతనంతిట్ట నియోజకవర్గంలో మూడవ స్థానంలో నిలిచారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 89 ఓట్ల తేడాతో మంజేశ్వరం నుంచి ఓడిపోయారు. 2019లో ఉప ఎన్నికలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. తరువాత 2020లో బిజెపి కేరళ విభాగానికి అధిపతిగా నియమితుడయ్యాడు.
వాయనాడ్ లో ఈసారి త్రిముఖ పోరు
ప్రస్తుతం కేరళ బిజెపి రాష్ట్రాధ్యక్షుడుగా ఉన్న కె.సురేంద్రన్ వాయనాడ్ నుంచి రాహుల్‌తో పోటీ పడుతున్నారు. ఈసారి కూడా త్రిముఖ పోరు ఉండనుంది. దక్షిణాదిలో కాంగ్రెస్, వామపక్షాలు ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ ఇండియా కూటమిలో సభ్యులుగా కొనసాగుతున్నారు. సురేంద్రన్ శబరిమలలో యువతుల ప్రవేశానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు నేతృత్వం వహించారు. కోజికోడ్‌కు చెందిన సురేంద్రన్బీజేపీ 5వ అభ్యర్థుల జాబితాలో ఉన్నారు. ఇందులో నటి కంగనా రనౌత్, కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ పేర్లు కూడా ఉన్నాయి.