LOADING...
కాంగ్రెస్,ఒవైసీలు హమాస్‌కు మద్దతు ఇచ్చి,ఉగ్రవాదాన్ని సమర్దిస్తున్నాయి: బండి సంజయ
కాంగ్రెస్,ఒవైసీలు హమాస్‌కు మద్దతు ఇచ్చి,ఉగ్రవాదాన్ని సమర్దిస్తున్నాయి: బండి సంజయ

కాంగ్రెస్,ఒవైసీలు హమాస్‌కు మద్దతు ఇచ్చి,ఉగ్రవాదాన్ని సమర్దిస్తున్నాయి: బండి సంజయ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2023
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్,అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఉగ్రవాదాన్నిసమర్థిస్తున్నాయని,హమాస్ ఉగ్రవాదులకు మద్దతిస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మంగళవారం ఆరోపించారు. హమాస్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్, ఏఐఎంఐఎం రెండూ ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నాయని సంజయ్ ఆరోపించారు. యూపీఏ హయాంలో భారత్ అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడులను ఎదుర్కొన్నా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయన అన్నారు. "మజ్లీస్, కాంగ్రెస్ ఎప్పుడు PFI, హమాస్ ఉగ్రవాదులు, రోహింగ్యాల వైపే ఉంటాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత్‌కు శ్రీరామరక్ష" అని బండి సంజయ్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బండి సంజయ్ చేసిన ట్వీట్