Page Loader
Atishi Marlena: అతిషిపై రమేష్ బిధురి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. 'ఆతిశీ జింకలా పరుగెడుతున్నారు' 
అతిషిపై రమేష్ బిధురి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. 'ఆతిశీ జింకలా పరుగెడుతున్నారు'

Atishi Marlena: అతిషిపై రమేష్ బిధురి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. 'ఆతిశీ జింకలా పరుగెడుతున్నారు' 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2025
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడటంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.ఈనేపథ్యంలో,దిల్లీ సీఎం అతిషి మార్లెనా (Atishi Marlena)పై బీజేపీ సీనియర్ నేత,మాజీ ఎంపీ రమేశ్ బిధూడీ (Ramesh Bidhuri)ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. నాలుగేళ్ల పాటు దిల్లీ సమస్యలపై జాగ్రత్త పడని ఆతిశీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో ఓట్ల కోసం నగరవ్యాప్తంగా జింకలా పరుగెడుతున్నారని రమేశ్ బిధూడీ వ్యాఖ్యానించారు. "దిల్లీ ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.నగర వీధుల పరిస్థితి చూడండి.గత నాలుగేళ్లలో ఆతిశీ ఎప్పుడూ ఈ సమస్యలపై శ్రద్ధ పెట్టలేదు.ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమె అడవిలో జింకలా దిల్లీ వీధుల్లో తిరుగుతున్నారు"అని ఆయన అన్నారు.

వివరాలు 

వివాదాస్పద ప్రకటనలు చేయడం బిధూడీకి ఇదేం మొదటిసారి కాదు

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూడీ, గత వారం కూడా ఆతిశీ ఇంటిపేరు మార్చిన విషయం గురించి విమర్శలు చేశారు. ఇదే సమయంలో, వివాదాస్పద ప్రకటనలు చేయడం బిధూడీకి ఇదేం మొదటిసారి కాదు. బీఎస్పీ నేత డానిష్ అలీని దూషించడమే కాకుండా, ప్రియాంకా గాంధీ వంటి నేతలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అలాగే, భాజపా తరఫున దిల్లీ సీఎం అభ్యర్థిగా బిధూడీ ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారాన్ని తోసిపుచ్చిన ఆయన, సీఎం అభ్యర్థి రేసులో తాను లేనని స్పష్టం చేశారు.