Page Loader
BJP: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి మోదీ  
BJP: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల

BJP: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి మోదీ  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2024
06:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ నేతలు వినోద్‌ థావడే తదితరులు వివరాలు వెల్లడించారు. జాబితాలో 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల నుండి 195 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌ 27,మధ్యప్రదేశ్‌ 24,గుజరాత్‌ 15,రాజస్థాన్‌ 15,కేరళ 12,తెలంగాణ 9,ఝార్ఖండ్‌ 11, ఛత్తీస్‌గడ్‌ 12,దిల్లీ 5, జమ్ముకశ్మీర్‌ 2,ఉత్తరాఖండ్‌ 3,అరుణాచల్‌ ప్రదేశ్‌ 2,గోవా 1,త్రిపుర 1,అండమాన్‌ నికోబార్‌ 1,దమన్‌ అండ్‌ దీవ్‌ 1 అభ్యర్థులను పోటీలో నిలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ 

Details 

అభ్యర్థుల తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులు

అభ్యర్థుల తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్, 28 మంది మహిళలు, 47 మంది 50 అభ్యర్థులు ఉన్నారు. 27 మంది షెడ్యూల్డ్ కులాలు (SC), 18 మంది షెడ్యూల్డ్ తెగల(ST)అభ్యర్థులు ఉన్నారు. 57 ఇతర వెనుకబడిన తరగతులు (OBC),2 మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. తెలంగాణ నుండి ఎవరు పోటీ చేస్తున్నారంటే.. కరీంనగర్‌ - బండి సంజయ్‌కుమార్‌ నిజామబాద్‌- ధర్మపురి అర్వింద్‌ జహీరాబాద్‌- బీబీ పాటిల్‌ మల్కాజ్‌గిరి- ఈటల రాజేందర్‌ సికింద్రాబాద్‌- కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌- డాక్టర్‌ మాధవీ లత చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి నాగర్‌ కర్నూలు- పి. భారత్‌ భువనగిరి- బూర నర్సయ్య గౌడ్‌

Details 

ఎవరు ఎక్కడ నుండి పోటీ చేస్తున్నారంటే..

గుజరాత్ : అమిత్ షా గుజరాత్ - గాంధీ నగర్ మన్సుఖ్ మాండవీయ - పోర్‌బందర్ కేరళ రాజీవ్ చంద్రశేఖర్ - తిరువనంతపురం సురేశ్‌ గోపి - త్రిసూర్‌ మధ్యప్రదేశ్ జ్యోతిరాదిత్య సింథియా - గుణ శివరాజ్ సింగ్ చౌహాన్ - విదిశ ఉత్తర్‌ప్రదేశ్‌ రాజనాథ్‌ సింగ్ - లఖ్‌నవూ స్మృతీ ఇరానీ - అమేఠీ