Page Loader
Ruta Awhad: 'లాడెన్ జీవిత చరిత్ర చదవండి': జితేంద్ర అవధ్‌ సతీమణి వ్యాఖ్యలపై దుమారం
'లాడెన్ జీవిత చరిత్ర చదవండి': జితేంద్ర అవధ్‌ సతీమణి వ్యాఖ్యలపై దుమారం

Ruta Awhad: 'లాడెన్ జీవిత చరిత్ర చదవండి': జితేంద్ర అవధ్‌ సతీమణి వ్యాఖ్యలపై దుమారం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 27, 2024
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం 'ఇండియా' బ్లాక్ నేతలకు అలవాటైంది బీజేపీ మండిపడింది. మహారాష్ట్రలోని సీనియర్ నేత శరద్ పవార్‌ పార్టీకి చెందిన నేత జితేంద్ర అవధ్‌ సతీమణి రుతా అవధ్‌ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి. రుతా అవధ్ మాట్లాడుతూ, ఒసామా బిన్ లాడెన్‌ పరిస్థితుల కారణంగా ఉగ్రవాదిగా మారాడని, అతడి జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే జీవిత చరిత్ర చదవాల్సిన అవసరం ఉందని చెప్పడం వివాదాస్పదమైంది. ఆమె ఏపీజే అబ్దుల్‌ కలాం పేరును కూడా ప్రస్తావించడం తో ఈ వివాదం మరింత తీవ్రమైంది.

వివరాలు 

విమర్శలపై స్పందించిన రుతా

రుతా అవధ్‌ ఒక బహిరంగ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ''ఒసామా బిన్ లాడెన్‌ జీవిత చరిత్ర చదవండి. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎలా ఎదిగారో, అలాగే లాడెన్‌ ఉగ్రవాదిగా ఎలా మారాడో తెలుసుకోండి. లాడెన్‌ ఆ మార్గాన్ని ఎంచుకోవడానికి సమాజంలో ఏర్పడిన పరిస్థితులే కారణమయ్యాయి'' అని ఆమె వివరించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ''ఎన్‌సీపీ నేత సతీమణి లాడెన్‌ను సమర్థిస్తూ మాట్లాడారు. కలాం ప్రస్తావన తెచ్చి, ఉగ్రవాదులను సమర్థించడం ఇండియా బ్లాక్‌కు అలవాటే'' అని విమర్శించింది. రుతా అవధ్‌ దీనిపై స్పందిస్తూ, ఆమె వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణ ఇచ్చారు.