Page Loader
Boat sinked in Mahanadi: ఒడిశాలో ఘోర ప్రమాదం..మహానదిలో పడవ మునిగి ఎనిమిదిమంది మృతి..
సహాయక చర్యల కోసం రంగంలోకి దిగిన ఓడీఆర్​ ఎఫ్​ బృందాలు

Boat sinked in Mahanadi: ఒడిశాలో ఘోర ప్రమాదం..మహానదిలో పడవ మునిగి ఎనిమిదిమంది మృతి..

వ్రాసిన వారు Stalin
Apr 20, 2024
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశా (Odisha )లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జార్సుగూడ (Jharsuguda) జిల్లా బంధిపాలి (Bandhipali) ప్రాంతంలో మహానదిలో శుక్రవారం రాత్రి 50 మందితో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. తక్షణ సమాచారం అందుకున్న సహాయక చర్యల బృందం రక్షణ చర్యలు ప్రారంభించింది. శనివారం ఉదయం నాటికి ఏడు మృతదేహాలను బయటకు తీశారు. మరొకరి మృత దేహం కోసం సహాయక బృందాలు గాలింపు చేపట్టాయి. బార్ఘడ్ జిల్లా బంధిపల్లి ఏరియా నుంచి ప్రయాణికులతో బయల్దేరిన పడవ మధ్యలో వచ్చేసరికి నీరు చేరడంతో మునిగిపోయినట్లు తెలుస్తోంది. జార్సుగూడ లోని శారదా ఘాట్ వద్ద మరింత మందిని ఎక్కించుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

Boat Sinked in Odisha

రంగంలోకి దిగిన ఓడీఆర్​ ఎఫ్​ బృందాలు

సమాచారం అందుకున్న ఒడిశా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఓడీఆర్ ఎఫ్) (ODRF) సహాయ చర్యల కోసం రంగంలోకి దిగాయి. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు భువనేశ్వర్ (Bhuvaneswar) నుంచి క్యూబా డైవర్స్ ను కూడా తీసుకొచ్చినట్లు జిల్లా కలెక్టర్ (Collector) గోయల్ (Goyel) మీడియాకు వెల్లడించారు. ఇప్పటివరకు 48 మందిని కాపాడామని, వారిని క్షేమంగా ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ప్రమాదంలో మృతి చెందిన వారికి 4లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ముఖ్యమంత్రి (Chief Minister) నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) ప్రకటించారు.

Odisha - Boat sinked

మృతులు ఛత్తీస్​ గఢ్​ లోని ఖర్సియా కు చెందిన వారిగా గుర్తింపు

ఈ ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని రాథికాబాయి రథియా, కేసరిబాయి రథియా, లక్ష్మీ రథియా, చిన్నారి నవీన్ రథియా, చిన్నారి కునాల్ రథియా గా పోలీసులు గుర్తించారు. వీరంతా ఛత్తీస్ గఢ్ లోని ఖర్సియా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారిగా తెలుస్తోంది.