Page Loader
బీఆర్ఎస్ కి ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాజీనామా 
బీఆర్ఎస్ కి ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాజీనామా

బీఆర్ఎస్ కి ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాజీనామా 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2023
06:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అందరికంటే ముందు అధికార బీఆర్ఎస్ 115 స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. ఐతే టికెట్లు ఆశించిన ఆశావాహులు, పలువురు సిట్టింగ్‌లకు టికెట్ రాకపోవడంతో కొందరు అభ్యర్థులు పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. మొన్నటికి మొన్న మైనంపల్లి హనుమంతరావు షాక్ ఇచ్చారు. ఆ తరువాత నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఇప్పుడు తాజాగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ కి రాజీనామా చేసి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

Details 

కేటీఆర్ స్పందించకపోవడంతో రాజీనామా నిర్ణయం 

అంతకముందు బీఆర్ఎస్ ప్రకటించిన మొదటి జాబితాలో రాథోడ్ బాపురావు పేరు లేదు. ఆయన స్థానంలో బోథ్ నుంచి అనిల్ జాదవ్‌కు టికెట్ కేటాయించారు.దింతో రాథోడ్ బాపురావును పార్టీ మారాలంటూ ఆయన మద్దతుదారులు ఒత్తిడి చేశారు. మొదట పార్టీని వీడే అంశంపై రాథోడ్ బాపురావు విముఖత చూపారు.ఈ విషయమై సెప్టెంబర్ 23న బాపురావు మంత్రి కేటీఆర్ అపాయింట్‌మెంట్ కోరారు. దీనికి కేటీఆర్ స్పందించకపోవడంతో.. ఆయన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనకు టికెట్ ఇవ్వకపోవడంపై బాపురావు మనస్థాపానికి గురయ్యారు. నెల రోజుల క్రితం పార్టీని వీడబోనని బీఆర్ఎస్ లోనే ఉంటానని, ప్రభుత్వం తనకు మరో పదవి ఇస్తుందని భావిస్తున్నట్లు బాపురావు చెప్పారు.