
Mumbai hoarding collapse: ముంబై హోర్డింగ్ కూలిన ఘటన.. కారులో మాజీ ఎయిర్ ట్రాఫిక్ మేనేజర్, భార్య మృతదేహాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఘాట్‌కోపర్ హోర్డింగ్ ఘటన జరిగి నేటికి నాలుగు రోజులైంది.ఈ దుర్ఘటనలో 16 మంది ముంబైవాసులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ దుర్ఘటనలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC)రిటైర్డ్ మేనేజర్ మనోజ్ చన్సోరియా(60),ఆయన భార్య(59)మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
సోమవారం ముంబైలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో భారీ హోర్డింగ్ ఒక పెట్రోల్ పంప్‌పై కుప్పకూలిన విషయం తెలిసిందే.
ఈ హోర్డింగ్ కింద దాదాపు 100మంది చిక్కుకుపోయారు.వారిలో ఈ దంపతులు కూడా ఉన్నారు.
"కుళ్లిపోయిన స్థితిలో" ఉన్న జంట మృతదేహాలను హోర్డింగ్ కింద ఇరుక్కున్న కారు నుండి వెలికి తీసినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎమ్‌సి)అధికారి పిటిఐకి తెలిపారు.
ముంబై ఏటీసీలో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేసిన చన్సోరియా.. రెండు నెలల క్రితమే రిటైర్ అయ్యారు.
Details
ముంబైని వీడి,జబల్‌పుర్‌కు షిఫ్ట్
రిటైర్ అయ్యాక వారు ముంబైని వీడి,జబల్‌పుర్‌కు షిఫ్ట్ అయ్యారు. వీసా నిమిత్తం కొద్దిరోజుల క్రితం వారు ఇక్కడకు వచ్చారని బంధువులు తెలిపారు.
పని పూర్తి చేసుకొని పశ్చిమ ముంబైలోని ఏటీసీ అతిథి గృహం నుంచి రెడ్ కలర్ కారులో దంపతులు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు బయలుదేరారు.
జబల్‌పుర్ వెళుతున్నక్రమంలో..పెట్రోల్ ఫిల్ చేసుకునేందుకు బంక్ వద్ద కారు ఆపిన సమయంలోనే మృత్యువు వారిని కబళించింది.
Details
ఫోన్ ఎత్తకపోవడంతో.. మిస్సింగ్ ఫిర్యాదు
మనోజ్ చన్సోరియా కుమారుడు అమెరికాలో ఉంటున్నారు.
గత రెండు రోజులుగా తల్లిదండ్రులు ఫోన్ ఎత్తకపోవడంతో ఆందోళనగురైన అయన ముంబైలో ఉంటున్న బంధువులను అప్రమత్తం చేయడంతో.. వారు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే వారికి దుర్మరణం వార్త తెలిసింది.
ఈ బిల్‌బోర్డ్‌ను ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఇన్‌స్టాల్ చేసింది. ముంబై పోలీసులు ఈగో మీడియా యజమాని భవేష్ భిండేపై నేరపూరిత నరహత్య కింద కేసు నమోదు చేశారు.
భిండేపై గతంలో 23 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరిలో అతనిపై ములుంద్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు కూడా నమోదైంది.