Page Loader
Bomb threat: కేరళ సీఎం ఇంటికి బాంబు హెచ్చరిక.. అప్రమత్తమైన పోలీసులు
కేరళ సీఎం ఇంటికి బాంబు హెచ్చరిక.. అప్రమత్తమైన పోలీసులు

Bomb threat: కేరళ సీఎం ఇంటికి బాంబు హెచ్చరిక.. అప్రమత్తమైన పోలీసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 13, 2025
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు సందేశం అందడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తంపనూరు పోలీస్‌ స్టేషన్‌కు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్‌ పంపి, సీఎం నివాసమైన క్లిఫ్‌ హౌస్‌ వద్ద బాంబు పేలుళ్లు జరగబోతున్నాయని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే స్పందించి, బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ల సహాయంతో క్లిఫ్‌ హౌస్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తదుపరి తనిఖీల అనంతరం, ఆ ఇ-మెయిల్ నకిలీదని నిర్ధారణ అయ్యింది.

Details

దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు

'మేము మొత్తం ప్రాంగణాన్ని పరిశీలించాం. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని అధికారులు తెలిపారు. ఈ సమయంలో సీఎం విజయన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక కీలక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో, తాజా ఈ-మెయిల్‌ వాటితో సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.