Tamil Nadu: మదురైలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..
దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) ప్రజలను, అధికారులను నిరంతరం భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల, తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపు మెయిళ్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, మదురై ప్రాంతంలోని కేంద్రీయ విద్యాలయం, జీవన స్కూల్, వేలమ్మాల్ విద్యాలయాలకు ఈ-మెయిల్స్ వచ్చాయి. దీంతో సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ ఆ పాఠశాలలకు చేరుకొని తనిఖీలు చేపట్టాయి.
తాజ్ వెస్ట్ అండ్ హోటల్‌కు బాంబు బెదిరింపు
అయితే, కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ తాజ్ వెస్ట్ అండ్ హోటల్‌కు (Taj West End Hotel) ఇటీవల బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. ఈ హోటల్‌లో రాజకీయ నాయకులు, క్రికెటర్లు, ప్రముఖులు బస చేస్తుంటారు. అలాగే, దిల్లీలోని పలు స్కూళ్లు, ఆసుపత్రులు, విమానాశ్రయాలకు కూడా ఎన్నో మార్లు బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయి.