
Bomb threat: ఏపీ భవన్‌కు బాంబు బెదిరింపు మెయిల్.. ఢిల్లీలో హైఅలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని ఏపీ భవన్‌లో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం రాత్రి భవన్‌కి ఒక బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. దీంతో పోలీసులను, అధికారులు అప్రమత్తమయ్యారు.
వెంటనే భవన్‌లో భద్రతను పెంచి, డాగ్ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బాంబు లేదా ఎలాంటి ఆపద సంకేతాలు లభించకపోవడంతో ఇది ఫేక్ మెయిల్‌గా తేలింది.
దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కేంద్రంలోని సీనియర్ అధికారులు హాజరైన సందర్భంలో చోటుచేసుకుంది.
శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో 'పూలే' సినిమాను ప్రదర్శిస్తున్న సమయంలోనే ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది.
Details
విచారణ ప్రారంభించిన పోలీసులు
ప్రత్యేకించి, పార్లమెంట్, ఇండియా గేట్ వంటి ప్రాముఖ్య ప్రాంతాలకు సమీపంలో ఏపీ భవన్ ఉన్న కారణంగా భద్రతా అధికారుల్లో ఆందోళన నెలకొంది.
ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశ రాజధానిలో భద్రతా చర్యలు మరింత కఠినంగా అమలు చేస్తుండగా, ఈ మెయిల్ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
అయితే మెయిల్‌లో పేర్కొన్న బెదిరింపులన్నీ నిరాధారమైనవిగా తేలాయి. ఫేక్ బెదిరింపు మెయిల్‌ను ఎవరు పంపించారన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.