NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హైదరాబాద్ ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బాంబు బెదిరింపు.. భయం భయంలో అధికారులు
    తదుపరి వార్తా కథనం
    హైదరాబాద్ ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బాంబు బెదిరింపు.. భయం భయంలో అధికారులు
    హైదరాబాద్ ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బాంబు బెదిరింపు.. భయం భయంలో అధికారులు

    హైదరాబాద్ ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బాంబు బెదిరింపు.. భయం భయంలో అధికారులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 12, 2023
    05:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ మహానగరం బషీర్ బాగ్ పరిధిలోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపులు చేశారు.

    హుటాహుటిన కార్యాలయంలోని ఐటీ సిబ్బంది, అధికారులు ప్రాణభయంతో వెలుపలికి ఉరుకులు పరుగులు పెట్టారు.

    ఐటీ టవర్స్ పరిధిలోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయానికి బాంబు బెదిరిపు ఫోన్ రావడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు.

    వెంటనే బాంబు స్వ్కాడ్ తో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఐటీ టవర్స్ ప్రాంతాన్ని క్షణ్ణంగా తనిఖీ చేశారు. చెకింగ్ జరుగుతున్న సమయంలో ఐటీ శాఖ ఉద్యోగులంతా కార్యాలయానికి సమీపంలోనే ఉండి ఎక్కడ ఎం దొరుకుతుందనే ఉత్కంఠలో బాంబు స్క్వాడ్ పనితీరును చూడటం గమనార్హం.

    DETAILS

    పూర్తి తనిఖీల అనంతరం ఊపిరి పీల్చుకున్న ఐటీ శాఖ సిబ్బంది

    అనంతరం పరిసరాల్లోనూ పూర్తిగా తనిఖీలు చేసిన బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, ఐటీ కార్యాలయం, దాని ఆవరణ, అనుబంధ ప్రదేశాలను జల్లెడ పట్టారు.

    ఈ క్రమంలో ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ బాంబులు గానీ లేవని నిర్థారించారు. ఫలితంగా అటు పోలీసులు, ఇటు ఐటీ శాఖ సిబ్బంది, అధికారులు అంతా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

    తొలుత ఓ ఆగంతకుడు హైదరాబాద్ ఐటీ టవర్స్ లో బాంబు ఉందని, పోలీసులకే ఫొన్ చేసి చెప్పాడని సమాచారం. అయితే పోలీసులతో సదరు అనుమానితుడు ఫోన్ మాట్లాడుతుండగానే సదరు వ్యక్తి అతని ఫోన్ ను స్విచ్ఛాఫ్ చేయడం కొసమెరుపు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    ప్రభుత్వం
    హైదరాబాద్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆదాయపు పన్నుశాఖ/ఐటీ

    విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ  బీబీసీ
    2023-24 ఐటీ రిటర్న్స్: ITR-1, ITR-4 ఆఫ్‌లైన్ ఫామ్స్ విడుదల ఆదాయం
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ చెట్లపై నోట్ల కట్టలు  కర్ణాటక

    ప్రభుత్వం

    ITR ఫైలింగ్ లో ఇటువంటి తప్పులు చేయకండి ఆర్ధిక వ్యవస్థ
    మాన్యువల్ ధర నుండి ChatGPT వరకు టాటా ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియాలో వస్తున్న మార్పులు విమానం
    2023 ఫారిన్ ట్రేడ్ పాలసీని ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం వ్యాపారం
    ప్రభుత్వాస్పత్రి నుంచి నవజాత శిశువును ఈడ్చుకెళ్లిక కుక్క; చిన్నారి మృతి కర్ణాటక

    హైదరాబాద్

    నేడే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభం; 150ఏళ్లైనా చెక్క చెదరకుండా నిర్మాణం  తెలంగాణ
    మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    హైదరాబాద్ జూపార్కు టికెట్ ధరల పెంపు తెలంగాణ
    హైదరాబాద్‌లో జీరో షాడో డే; ఈనెల 9న నీడ కనిపంచదు  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025