Page Loader
India: విమానాలపై బాంబు బెదిరింపులు.. దర్యాప్తుకు ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్‌ మద్దతు
విమానాలపై బాంబు బెదిరింపులు.. దర్యాప్తుకు ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్‌ మద్దతు

India: విమానాలపై బాంబు బెదిరింపులు.. దర్యాప్తుకు ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్‌ మద్దతు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 31, 2024
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

విమానాలకు సంబంధించి ఈ మధ్య బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. భారత్ ఇంటర్‌పోల్, ఎఫ్‌బీఐ నుంచి సాయం కోరింది. అక్టోబర్ 13 నుండి 28 వరకు 410కు పైగా దేశీయ మరియు అంతర్జాతీయ విమాన సేవలకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ బెదిరింపుల వెనక అమెరికాలోని ఖలిస్థానీ గ్రూపుల హస్తం ఉండోచ్చని భారత్ అనుమానిస్తోంది. గత వారం, సిఖ్స్ ఫర్ జస్టిస్ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత ప్రభుత్వాన్ని బహిరంగంగా బెదిరించిన విషయం తెలిసిందే. నవంబర్ 1-19 మధ్య ఎయిర్ విమానాలను బాయ్‌కాట్ చేయాలని, ఆర్థికంగా భారత్‌ను నాశనం చేయమని ఆయన పేర్కొన్నారు.

Details

ఎఫ్‌బీఐ కీలక పాత్ర

భారత్ విజ్ఞప్తికి అమెరికా ఎఫ్‌బీఐ కూడా సానుకూలంగా స్పందించింది. ఈ బెదిరింపులను ట్రాక్ చేసేందుకు, సోషల్ మీడియా వేదికల నుండి వచ్చే మెయిల్స్‌ను అన్వేషించడానికి సహకరించనుంది. అమెరికా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు భారత సిబ్బందితో సమన్వయంగా పని చేస్తున్నారని, ఈ బాంబు బెదిరింపులపై దర్యాప్తుకు సహాయపడుతామని ప్రకటించారని దిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం ఒక పత్రికకు వెల్లడించింది. ముఖ్యంగా పన్నూపై బెదిరింపుల దర్యాప్తులో ఎఫ్‌బీఐ కీలక పాత్ర పోషించనుంది. జర్మనీ, యూకే నుంచి సమాచార సేకరణకు ఇంటర్‌పోల్‌కు భారత బృందం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది.

Details

ముమ్మరంగా దర్యాప్తు

వీపీఎన్‌లను వాడి పంపిన సందేశాల మూలాలు ఈ దేశాల్లో ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు జరుగుతోందని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈ బెదిరింపులు నిన్న కూడా అనేక విమానాలను ప్రభావితం చేశాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆరు విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. మరోవైపు, కేరళలోని కోజికోడ్‌లో అబుదాబీకి వెళుతున్న ఎయిర్ అరేబియా విమానానికి బెదిరింపు కాల్ చేసిన మహమ్మద్ ఇజాస్‌ను పాలక్కాడ్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు.