తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Bomb threat: తిరుపతిలో కలకలం.. రాజ్ పార్క్ హోటల్‌కు బాంబు బెదిరింపులు
                వ్రాసిన వారు
                Jayachandra Akuri
            
            
                            
                                    Oct 26, 2024 
                    
                     10:23 am
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతిలోని మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో హోటల్‌లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. గురువారం కూడా తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు గురువారం మెయిల్ ద్వారా బెదిరింపులు అందడంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు.
Details
కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ సందర్భంగా, డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలతో కలిసి సిబ్బంది అత్యవసర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో, పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.