
కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాదాపు 20ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి.
ఈ క్రమంలో రెండు పార్టీలు మాత్రం కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు అంగీకరించడం గమనార్హం.
ఒడిశాలోని అధికార పార్టీ బిజూ జనతాదళ్(బీజేడీ), ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వాలని నిర్ణయించాయి.
తమ పార్టీ ఎంపీలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు బీజేడీ అధికార ప్రతినిధి లెనిన్ మొహంతి ప్రకటన విడుదల చేశారు.
ప్రజాస్వామ్యానికి చిహ్నంగా ఉన్న పార్లమెంటు రాజకీయాలకు అతీతమైనదన్నారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిల్లీలో మోదీని కలిసిన రెండు వారాలకే బీజేడీ ఈ ప్రకటన చేసింది.
ప్రస్తుతం బీజేడీకి లోక్‌సభలో 12మంది, రాజ్యసభలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు.
దిల్లీ
రాజకీయాలకు ఇది సమయం కాదు: ప్రహ్లాద్ జోషి
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి వైఎస్సార్సీపీ కూడా హాజరవుతానని ప్రకటించింది.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రత్యేక నిధులను పెద్దమొత్తంలో ఇటీవల కేంద్రం విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు కేంద్రానికి పరోక్షంగా మద్దతిస్తూనే ఉన్నారు.
అంతకుముందు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. కొత్త పార్లమెంటు ప్రారంభాన్ని విపక్షాలు బహిష్కరించడం దురదృష్టకరమని అన్నారు.
ఇది ఒక చారిత్రక సంఘటన అని తాను చెప్పాలనుకుంటున్నానని వెల్లడించారు. రాజకీయాలకు ఇద సమయం కాదన్నారు.
శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడీ), టీడీపీ కూడా ప్రారంభోత్సవానికి హాజరవుతామని ఇప్పటికే ప్రకటించాయి.