
Karnataka: కర్ణాటకలో సీఐఎస్‌ఎఫ్ మహిళా అధికారి మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని బెళగావిలో ఓ సీఐఎస్‌ఎఫ్ మహిళా అధికారి మోసం చేసిందని ఆరోపిస్తూ ఆమె ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపురకు చెందిన అభిషేక్ సింగ్ (40) చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్‌కు చెందిన మోనిక సింగ్‌తో పరిచయం ఏర్పడింది.
ఆమె ప్రస్తుతం బెళగావిలో సీఐఎస్‌ఎఫ్‌లో సహాయక కమాండెంట్‌గా పనిచేస్తున్నారు. అభిషేక్ చెప్పిన మేరకు, మోనిక తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని ఆరోపించాడు.
Details
కేసు నమోదు చేసుకున్న బెళగావి పోలీసులు
సోమవారం మంగళూరు రావ్ సర్కిల్‌లోని ఓ లాడ్జ్‌లో అభిషేక్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు ముందు, ఆయన ఓ లేఖ రాశాడు.
అందులో మోనిక ఇప్పటికే వివాహిత అయినా తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించిందన్నారు. తనను లైంగికంగా ఉపయోగించుకున్నట్లు ఆరోపించాడు.
అంతేకాకుండా, పెళ్లి విషయాన్ని ప్రశ్నించగా, బెదిరించి మానసికంగా హింసించిందని సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు.
తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై బెళగావి నగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.