I.N.D.I.A: దేశం పేరును సొంత ప్రయోజనం కోసం వాడుతున్నారని కేసు నమోదు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 19, 2023
08:55 pm
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని 26 విపక్ష పార్టీలు కలిసి కూటమికి I.N.D.I.A అని పేరు పెట్టుకోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీని పై పోలీస్ ఫిర్యాదు నమోదైంది. దేశం పేరును తప్పుడు ప్రయోజనం కోసం వాడుకుంటున్నాయని డాక్టర్ అవినాష్ మిశ్రా న్యూఢిల్లీలోని బరాఖంబ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 1950 నాటి ఎంబ్లమ్స్ యాక్ట్‌లో పొందుపరిచిన అంశాల ఆధారంగా I.N.D.I.A పేరును తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరూ ఉపయోగించుకోలేరని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని ఆయన కోరారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి