NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad: ఫ్లెక్సీల వివాదం.. బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌పై దాడి.. ! 
    తదుపరి వార్తా కథనం
    Hyderabad: ఫ్లెక్సీల వివాదం.. బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌పై దాడి.. ! 
    Hyderabad: ఫ్లెక్సీల వివాదం.. బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌పై దాడి.. !

    Hyderabad: ఫ్లెక్సీల వివాదం.. బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌పై దాడి.. ! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 13, 2024
    12:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌లోని ఓ కాంగ్రెస్ నాయకుడి నివాసం వెలుపల ఉన్న ఫ్లెక్సీ బోర్డులను తొలగించే వివాదంతో హైదరాబాద్‌లోని స్థానిక భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్)కార్పొరేటర్ దేదీప్యారావుపై గుర్తు తెలియని మహిళలు దాడి చేశారు.

    కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ ఇంటి బయట ఉన్న ఫ్లెక్సీ బోర్డులను తొలగించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న దేదీప్యారావు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డిఆర్‌ఎఫ్)ని ఆదేశించిన సంఘటన మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని వెంగల్ రావు నగర్ ప్రాంతంలో జరిగింది.

    వెంటనే కాంగ్రెస్ నాయకుడి మద్దతుదారులు సంఘటనా స్థలానికి చేరుకుని దేదీప్యారావుతో వాగ్వాదానికి దిగారు.

    కార్పొరేటర్‌కు మద్దతుగా ఉన్న వ్యక్తులు కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

    Details 

    దేదీప్యారావుపై భౌతికంగా దాడి

    దేదీప్యారావు తన వాహనంలో ఎక్కుతుండగా పలువురు గుర్తు తెలియని మహిళలు దేదీప్యారావుపై భౌతికంగా దాడి చేశారు.

    అయితే, స్వల్ప గాయాలతో బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావు బయటపడ్డారు.

    గొడవ జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు.

    "ఈ సంఘటన గత రాత్రి జరిగింది. కార్పొరేటర్‌పై దాడి చేసిన మహిళలపై మేము కేసు నమోదు చేసాము" అని జూబ్లీహిల్స్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఆర్ మధుసూధన్ ఉటంకిస్తూ ANI న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

    ఇకపోతే ఈ సంఘటనకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కార్పొరేటర్ పై దాడి చేస్తున్న మహిళలు  

    BRS Corporator Dedeepya Rao Attacked By Women In Jubilee Hills #PakkaTelugu #Telangana#BRS #BRSParty #jubileeHills #viralvideo #Dedeepya #HyderabadNews #Hyderabad pic.twitter.com/hL0eDDVLX4

    — Pakka Telugu (@PakkaTelugu_com) March 13, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్
    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్
    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార

    హైదరాబాద్

    Praja Bhavan Accident: ప్రజాభవన్‌ కారు యాక్సిడెంట్ కేసు మరో కొత్త కోణం.. నిందితుడు మాజీ ఎమ్మెల్యే కొడుకే  బోధన్
    Hyderabad: న్యూ ఇయర్ స్పెషల్.. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు  మెట్రో రైలు
    Hyderabad Drunk And Drive : కొత్త సంవత్సరం సందర్భంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు ఎన్నంటే!  భారతదేశం
    Hyderabad: బిర్యానీ ఉడకలేదన్న కస్టమర్లపై హోటల్‌ సిబ్బంది దాడి  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025