Page Loader
Padi Kaushik Reddy: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు

Padi Kaushik Reddy: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2025
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కు తరలించారు. పాడి కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు. రూ. 50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బెదిరించారంటూ కమలాపురం మండలం వంగపల్లిలోని క్వారీ నిర్వహిస్తున్న గ్రానైట్ వ్యాపారి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Details

గతంలో కేసు నమోదు

ఈ ఫిర్యాదు ఆధారంగా కౌశిక్ రెడ్డిపై సుబేదారి పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదయింది. ఏప్రిల్‌లో ఈ కేసును కొట్టివేయాలని పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేయగా, జూన్‌ 16న కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. కోర్టు పిటిషన్‌ను కొట్టివేయడంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుబేదారి పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి, విచారణ నిమిత్తం వరంగల్‌ కు తరలించారు.