తదుపరి వార్తా కథనం

Vijayawada: విజయవాడలో ఇద్దరు యువకుల దారుణ హత్య
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 16, 2025
04:10 pm
ఈ వార్తాకథనం ఏంటి
విజయవాడలోని గవర్నర్‌పేట ప్రాంతంలో జంటహత్యలు సంచలనం రేపాయి. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి హతమార్చిన ఘటన అన్నపూర్ణ థియేటర్ సమీపంలో చోటుచేసుకుంది. మృతులు విజయనగరం జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. వారు క్యాటరింగ్ పనుల నిమిత్తం విజయవాడకు వచ్చి అదే ప్రాంతంలో అద్దె గదుల్లో ఉంటున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే క్లూస్ టీమ్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
Details
నిందితుడు రౌడీ షీటర్ గా గుర్తింపు
దాడి చేసిన వ్యక్తి స్థానిక రౌడీషీటర్ అని తెలుస్తోంది. అతడు కత్తితో దాడి చేసి పరారైనట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. ఇద్దరు యువకుల దారుణ హత్య స్థానికంగా భయానక వాతావరణాన్ని సృష్టించింది. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.