BS Yediyurappa: మైనర్‌పై మాజీ ముఖ్యమంత్రిపై లైంగిక వేధింపులు.. పోక్సో కేసు నమోదు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మాజీ సీఎం యడియూరప్ప ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు పోక్సో(లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణ)చట్టంలోని సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 2న చీటింగ్ కేసులో సహాయం కోరేందుకు తల్లి,కుమార్తె యడ్యూరప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు లైంగిక వేధింపులు జరిగినట్లు బాలిక తల్లి ఆరోపించారు. యడియూరప్పపై లోక్‌సభ ఎన్నికల ముందు ఆరోపణలు రావడం చర్చనీయాంశం అయింది.
కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ సోమప్ప బొమ్మై
యడ్యూరప్ప 2008, 2011 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా, 2018 మేలో కొద్దికాలం పాటు, మళ్లీ జూలై 2019 నుండి 2021 వరకు పనిచేశారు. ఆ తరువాత బీజేపీ అధిష్టానం యడియూరప్పను తప్పించి జూలై 2021లో బసవరాజ్ సోమప్ప బొమ్మైను కర్ణాటక 23వ ముఖ్యమంత్రిని చేసింది. బొమ్మై జూలై 2021 నుండి మే 2023 వరకు పనిచేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు హవేరి నియోజకవర్గం నుండి బొమ్మైని బిజెపి అభ్యర్థిగా ప్రకటించింది.