Page Loader
Budget 2024: గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్ 
Budget 2024: గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్

Budget 2024: గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్ 

వ్రాసిన వారు Stalin
Feb 01, 2024
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ఈ మధ్యంతర బడ్జెట్‌లో ఆరోగ్య విభాగంలో ఆరోగ్యానికి సంబంధించి నిర్మలా సీతారామన్ కీలక ప్రతిపాదనలు చేశారు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి 9-14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ఉచిత టీకాను అందించనున్నట్లు చెప్పారు. 'ఇంద్రధనుష్' కింద దీనికి సంబంధించన ప్రచారాన్ని చేపట్టనున్నారు. ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఆరోగ్య భద్రత వర్తిస్తుంది. అంగన్‌వాడీలను అప్‌గ్రేడ్ చేస్తామని నిర్మల ప్రకటించారు. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను 'సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా' తయారు చేయనుంది.

వ్యాక్సిన్

వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సిరమ్ ఇన్‌స్టిట్యూట్ 

గర్భాశయ క్యాన్సర్‌ను నివారించే 'సెర్వవాక్' అనే వ్యాక్సిన్‌ను సిరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) అభివృద్ధి చేస్తుంది. వ్యాక్సిన్‌ ధర రూ.200 నుంచి రూ.400 వరకు ఎస్‌ఐఐ సీఈవో అదార్‌ పూనావాలా ఇప్పటికే తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో సర్వైకల్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ వ్యాక్సిన్‌ల ధర ఒక్కో డోసు రూ.2,500-3,300 వరకు ఉన్నాయి. సిక్కిం ప్రభుత్వం 2016లో గర్భాశయ క్యాన్సర్ నివారణకు GAVI అనే వ్యాక్సిన్‌ని కొనుగోలు చేసింది. 9 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు వ్యాక్సిన్‌ను అందించింది.