AP budget: అన్నదాత సుఖీభవ పథకానికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో సూపర్ సిక్స్ పథకాల కోసం భారీగా నిధులు కేటాయించారు.
అన్నదాత సుఖీభవ పథకానికి రూ. 6300 కోట్లు మంజూరు చేశారు.
ఈ పథకాలకు సంబంధించి మంత్రి నారా లోకేశ్ మండలిలో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
ఏప్రిల్, మే మాసాల్లో అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేస్తామని కౌన్సిల్‌లో స్పష్టంగా వెల్లడించారు.
ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటామని చెప్పారు.
వ్యవసాయ శాఖకు గణనీయమైన నిధులు కేటాయిస్తూ, ప్రతి రైతుకు రూ. 20,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు.
వివరాలు
అన్నదాత సుఖీభవ
మొత్తం బడ్జెట్ రూ. 3,22,359 కోట్లు కాగా, వ్యవసాయానికి ప్రత్యేకంగా రూ. 48,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు.
అన్నదాత సుఖీభవ స్కీమ్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయశాఖకు రూ. 11,636 కోట్లు కేటాయించింది.
కొన్ని రోజుల్లో రైతు భరోసా స్కీమ్ అమల్లోకి రానుంది.ఈ స్కీమ్ ద్వారా ప్రతి రైతుకు రూ. 20,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజాగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
అన్నదాత సుఖీభవ పథకం త్వరలో అమలు చేయనున్నట్లు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000కు అదనంగా రూ.14,000 మొత్తాన్ని మూడు విడతల్లో రైతులకు చెల్లించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.