AP News: రాష్ట్రంలో అనధికార,అక్రమ నిర్మాణాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసిన పురపాలకశాఖ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్'లో అనధికార, అక్రమ నిర్మాణాలకు సంబంధించి పురపాలకశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇటీవల సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు జారీ చేసిన ఆదేశాల ఆధారంగా ఈ మార్గదర్శకాలను రూపొందించారు.
ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాలు
పురపాలకశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు:
ఆక్యుపేషన్ సర్టిఫికెట్ పొందడానికి భవన యజమానుల వద్ద అండర్ టేకింగ్ తీసుకోవాలి.
ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఉంటేనే భవనాల్లో నివాసానికి అనుమతి ఇవ్వాలి.
నిర్మాణం పూర్తయ్యే వరకు ప్లాన్‌ను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలి.
సంబంధిత అధికారులు సమయానుసారంగా బిల్డింగ్ ప్లాన్, నిర్మాణాన్ని తనిఖీ చేయాలి.
డీవియేషన్ (అనుమతించని మార్పులు) సరిచేసే వరకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇవ్వకూడదు.
డీవియేషన్ ఉన్న భవనాలకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇచ్చినట్టయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారు.
వివరాలు
పురపాలకశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు:
నివాసయోగ్య ధ్రువపత్రం జారీ అయిన తర్వాతే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్లు కల్పించాలి.
అక్రమంగా నిర్మించిన భవనాలకు ట్రేడ్, బిజినెస్ లైసెన్స్‌లు మంజూరు చేయకూడదు.
జోనల్ ప్లాన్ ప్రకారం అనుమతించని మార్పులు లేకుండా నిర్మాణాలు ఉండేలా చూడాలి.
బ్యాంకులు రుణాలు మంజూరు చేసే ముందు నివాసయోగ్య ధ్రువపత్రం ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించాలి.
ఈ మార్గదర్శకాలు రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యేలా అధికారులందరూ కఠిన చర్యలు తీసుకోవాలని పురపాలకశాఖ స్పష్టం చేసింది.