తదుపరి వార్తా కథనం

Haryana: హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా... 5గురు చిన్నారులు మృతి
వ్రాసిన వారు
Sirish Praharaju
Apr 11, 2024
10:41 am
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానా మహేంద్రగఢ్ జిల్లాలోని కనీనా దాద్రి రోడ్డులో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఇంకా పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం.
ఈద్-ఉల్-ఫితర్‌కు సెలవు ఉన్నప్పటికీ పాఠశాల పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జిఎల్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు కనీనాలోని ఉన్హాని గ్రామ సమీపంలో బోల్తా పడింది.
ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు కానీ బస్సు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ గడువు ఆరేళ్ల క్రితం 2018లో ముగిసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అదుపు తప్పి బోల్తా పడిన స్కూల్ బస్సు
#NewsAlert | School bus overturns in Haryana's Narnaul, several children injured. More details awaited. #school #accident #Children #Injured pic.twitter.com/6z58gYK3QL
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) April 11, 2024