Page Loader
సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం
సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం

సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం

వ్రాసిన వారు Stalin
Jun 28, 2023
08:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా భారత్- విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ) ప్రధాన కార్యాలయ ఒప్పందానికి (హెచ్‌క్యూఏ) ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్‌ను గత ఏడాది ఆగస్టు 22న ప్రతిపాదించింది. సెప్టెంబర్ 23, 2019న న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ సీఆర్‌డీఐని ప్రారంభించారు. దీన్ని భారత ప్రభుత్వమే ప్రతిపాదించింది. వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణలో ప్రపంచ నాయకత్వ పాత్రను పోషించేందుకు భారతదేశం ఈ బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది.

కేంద్రం

గతేడాది జూన్ 29న సీడీఆర్ఐని అంతర్జాతీయ సంస్థగా గుర్తించిన కేంద్రం

ఆగస్ట్ 28, 2019న, దిల్లీలో పార్లమెంట్‌తో పాటు సీడీఆర్ఐ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదించింది. 2019-20 నుంచి 2023-24 ఐదు సంవత్సరాల కాలానికి సీడీఆర్‌ఐకి భారత ప్రభుత్వం రూ.480 కోట్ల ఆర్థిక సహాయానికి ఆమోదం తెలిపింది. గతేడాది జూన్ 29న, క్యాబినెట్ సీడీఆర్ఐని అంతర్జాతీయ సంస్థగా గుర్తించింది. ఐక్యరాజ్య సమితి చట్టం 1947, సెక్షన్-3 కింద పరిగణించిన విధంగా సీడీఆర్ఐకి మినహాయింపులు, అధికారాలను మంజూరు చేయడానికి ప్రధాన కార్యాలయ ఒప్పందం (హెచ్‌క్యూఏ) కోసం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా, గత ఏడాది ఆగస్టు 22న, భారత ప్రభుత్వం, సీడీఆర్ఐ మధ్య హెచ్‌క్యూఏ కోసం సంతకం చేశారు.

కేంద్రం

సీడీఆర్ఐలో 31 సభ్య దేశాలు 

ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలు, ప్రైవేట్ రంగం, విద్యా, విజ్ఞాన సంస్థల ప్రపంచ భాగస్వామ్యంతో వాతావరణం, విపత్తుల నష్టాల నివారణకు సంబంధించిన మౌలిక సదుపాయాల వ్యవస్థల ఏర్పాటును ప్రోహత్సహించేందుకు సీడీఆర్‌ఐ ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది. 31 దేశాలు, ఆరు అంతర్జాతీయ సంస్థలు, రెండు ప్రైవేట్ రంగ సంస్థలు సీడీఆర్‌ఐలో సభ్యులుగా ఉన్నాయి. సీడీఆర్‌ఐ అనేక రకాల ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వాతావరణ మార్పు, విపత్తులకు అత్యంత హాని కలిగించే దేశాలను ఆకర్షించడం ద్వారా దాని సభ్యత్వాన్ని స్థిరంగా విస్తరిస్తోంది.