RG Kar case: ఆర్జీకర్ కేసులో బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన కలకత్తా హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
కోల్‌కతాలోని ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించిన ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ,పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది.
అయితే హైకోర్టు ఈప్రత్యేక అప్పీల్‌ను స్వీకరించేందుకు నిరాకరించింది.
అదే సమయంలో,అదే తీర్పును సవాలు చేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI)దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయస్థానం అంగీకరించింది.
ఇదే కేసులో,మృతురాలి తల్లిదండ్రులు కేసు పునర్విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
అయితే,సుప్రీంకోర్టు దానిని తిరస్కరించింది.అయినప్పటికీ,మార్చి 17న ఈ విషయంపై విచారణ చేపడతామని వెల్లడించింది.
గతేడాది ఆగస్టు 9న రాత్రి ఆర్జీకర్ ఆసుపత్రిలో ఓ మహిళా వైద్యురాలిపై హత్యాచారం జరగగా, సియాల్దా కోర్టు ఈ కేసులో నిందితుడు సంజయ్‌కు జీవితఖైదు విధించింది.
వివరాలు
మమతా ప్రభుత్వ తీరుపై మృతురాలి తండ్రి అసంతృప్తి
అంతేకాకుండా, బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ తీర్పుపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ, మమతా ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.
అయితే, ఈ అప్పీల్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ కేసును విచారించిన సంస్థగా శిక్ష విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు తమకే ఉందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం అనవసరమని పేర్కొంది.
మమతా ప్రభుత్వ తీరుపై మృతురాలి తండ్రి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ఈ వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు అవసరం లేదని సూచించారు.