Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక.. ప్రధాని అధ్యక్షతన బీజేపీ కీలక సమావేశం
లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,కేంద్ర మంత్రులు అమిత్ షా,రాజ్‌నాథ్ సింగ్, ఇతర నేతలు హాజరయ్యారు. సమావేశంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్,మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్,గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్,మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్,ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి,ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి,గోవా సీఎం ప్రమోద్ సావంత్ సహా రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించకముందే బీజేపీ తొలి జాబితా
ఏప్రిల్-మేలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించకముందే బీజేపీ తొలి జాబితాను విడుదల చేయాలని యోచిస్తోంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం, ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల తేదీలను విడుదల చేయడానికి ముందే ఉత్తర్‌ప్రదేశ్‌లోని "బలహీనమైన స్థానాల"పై బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. గత వారం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జెపి నడ్డా, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా బిజెపి అగ్ర నాయకులు పార్టీ గట్టి ఎన్నికల సవాలును ఎదుర్కొనే "బలహీనమైన సీట్ల" గురించి చర్చించడానికి సమావేశాన్ని నిర్వహించారు.