Page Loader
Cash For Query : మహువా మోయిత్రాకు ఉచ్చు..రేపు నివేదికను స్వీకరించనున్న ప్యానెల్ 
రేపు నివేదికను స్వీకరించనున్న ప్యానెల్

Cash For Query : మహువా మోయిత్రాకు ఉచ్చు..రేపు నివేదికను స్వీకరించనున్న ప్యానెల్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
ద్వారా సవరించబడింది Sirish Praharaju
Nov 06, 2023
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

తృణముల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ, మహువా మోయిత్రాకు ఉచ్చు బిగుస్తోంది. ఈ మేరకు ప్రశ్నకు నగదు కేసులో మంగళవారం, లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ప్యానెల్ డ్రాఫ్ట్ నివేదికను స్వీకరించనుంది. అనంతరం సదరు ఎంపీపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు వినోద్ కుమార్ సోంకర్ నేతృత్వంలోని లోక్‌సభ ఎథిక్స్ కమిటీ మంగళవారం సమావేశం కానుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాపై ఆరోపణలను విచారణ ప్రారంభించిన రెండు వారాల లోపే ముసాయిదా నివేదికను పరిశీలించి, ఆమోదించనుంది. ప్రస్తుత లోక్‌సభలో మిగిలిన కాలానికి అనర్హత సహా మొయిత్రాపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్యానెల్ సిఫార్స్ చేయవచ్చని తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తప్పుడు కథలతో మహిళా ఎంపీలకు ఉద్వాసన పలికే కుట్ర : మోయిత్రా

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సారీ బీజేపీ,సారీ అదానీ, మళ్లింపు వ్యూహాలు పనిచేయవంటున్న మహువా మోయిత్రా

Details 

కమిటీ ఛైర్మన్ ప్రశ్నలు అసంబద్ధమైంది, సిగ్గుపడాల్సినవి : మోయిత్రా

మరోవైపు 2005లో ఇలాంటి కేసులోనే ప్రశ్నలడిగినందుకు డబ్బును స్వీకరించినట్లు అనుమానించిన మొత్తం 11 మంది ఎంపీలు అనర్హతకు గురయ్యారని అధికారులు తెలిపారు. 2007 జనవరిలో సుప్రీంకోర్టు సదరు అనర్హతను సమర్థించింది. అయితే మొయిత్రా ఆదివారం నాడు సైతం బీజేపీపై తన మాటల దాడిని కొనసాగించారు. బీజేపీ తప్పుడు కథనంతో మహిళా ఎంపీలను బయటకు నెట్టే ముందు నేను ఎథిక్స్ కమిటీ ముందు హాజరైనప్పుడు చేసిన పదజాలం తన వద్ద రికార్డు ఉందన్నారు. ఛైర్మన్ సోంకర్, చౌకైన దుర్మార్గపు అసంబద్ధమైన ప్రశ్నలు అడిగారని, ప్రతిపక్షాల నిరసనలు, తన నిరసనలు అన్నీ అధికారికంగా నలుపు , తెలుపు రంగులోనే ఉన్నాయన్నారు. ఎథిక్స్ ప్యానెల్ చేస్తున్న పనులు అసంబద్దమైనవని, సిగ్గుపడాల్సిన విషయాలని మోయిత్రా ట్విట్టర్'లో పోస్ట్ చేసింది.