
Praveen Sood: ప్రవీణ్ సూద్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు
ఈ వార్తాకథనం ఏంటి
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సేవల్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది.
కొత్త సీబీఐ డైరెక్టర్‌ను నియమించే విషయంలో ఏకాభిప్రాయం నెలకొనకపోవడంతో ఆయన పదవీకాలాన్ని కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ పదవీకాలం పొడిగింపుకు మంత్రుల కమిటీగా వ్యవహరించే అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది.
ప్రవీణ్ సూద్ ప్రస్తుత పదవీకాలం ఈ నెల 24వ తేదీన ముగియాల్సి ఉంది.ప్రవీణ్ సూద్ 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.
1989లో మైసూరు ప్రాంతంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా తన పోలీసు సేవలను ప్రారంభించారు.
అనంతరం బళ్లారి,రాయచూరు జిల్లాల్లో పోలీసు అధికారి(ఎస్‌పీ)గా బాధ్యతలు నిర్వహించారు.
ఆతర్వాత బెంగళూరులో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)గా సేవలందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కొత్త డైరెక్టర్ ఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సర్వీస్ పొడిగింపు
CBI director Praveen Sood की सेवाएँ एक साल के लिए बढ़ाई गईं. दो दिन पहले नए नाम पर विचार के लिए बैठक हुई थी pic.twitter.com/jc9tre3Z2b
— Vijai Trivedi (@vijaitrivedi) May 7, 2025