LOADING...
Delhi Liquor case: ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం.. కవితను విచారించేందుకు సీబీఐ పిటిషన్ 
కవితను విచారించేందుకు సీబీఐ పిటిషన్

Delhi Liquor case: ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం.. కవితను విచారించేందుకు సీబీఐ పిటిషన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 05, 2024
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ పాలసీ కేసులో కవితను విచారించాల్సిన అవసరముందని సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది. రిమాండ్‌లో భాగంగా కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. గురువారం బెయిల్ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది. ఈ లోపు సీబీఐ రంగంలోకి దిగడంతో ఈ కేసు ఎటు దారి తీస్తుందో అని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కవితను విచారించేందుకు రంగంలోకి  సీబీఐ