ELECTION CODE : అమల్లోకి ఎన్నికల కోడ్.. రాజకీయ పార్టీలు ఇలాంటివన్నీ చేయకూడదు
సోమవారం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. సీఈసీ ప్రకటనతోనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినట్టైంది. దీంతో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాేమని ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. పొలిటికల్ పార్టీలు ఇవి చేయకూడదు : ఎన్నికలతో సంబంధం ఉన్న ఏ అధికార పార్టీ నేతలను,మంత్రులను, వారి ఇంటి వద్ద వ్యక్తిగతంగా కలవకూడదు. ప్రభుత్వ సొమ్ముతో పార్టీలు, పార్టీ నాయకులు, తమ నివాసాల వద్ద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. సొంత ఖర్చుతో మాత్రం చేసుకునేందుకు అనుమతి.
అధికారం పార్టీ ప్రభుత్వ నిధులతో ఎలాంటి ప్రకటనలు ఇవ్వరాదు
ప్రభుత్వ సంక్షేమ పథకం, ప్రాజెక్టు కానీ కోడ్ అమల్లోకి వచ్చే ముందే మొదలైతే మినహా కోడ్ అమల్లోకి వచ్చాక కొత్త పని ప్రారంభించేందుకు అనుమతి లేదు. అధికారం పార్టీ ప్రభుత్వ నిధులతో ఎలాంటి ప్రకటనలు ఇవ్వరాదు. ఎమ్మెల్యే, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయరాదు. కొత్తగా పెన్షన్ మంజూరీ, దరఖాస్తు స్వీకరణ, కొత్త రేషన్ కార్డు జారీ, బీపీఎల్ కుటుంబాలకు ఎల్లో కార్డులు ఇవ్వడం చేయకూడదు. ఆయుధ లైసెన్స్ ఇవ్వకూడదు. టెండర్లు జారీ, కొత్త పనులు ప్రారంభించడం చేయరాదు. కొత్తగా పనులు ప్రారంభించడం, పెద్ద భవనాలకు క్లియరెన్స్ ఇవ్వడం కుదరదు. రూ.50 వేల వరకే నగదుకు అనుమతులుండగా, అంతకు మించి డబ్బు, బంగారం, సామగ్రి ఉంటే సీజ్ చేస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు ప్రారంభం
మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీగా నగదు, బంగారం, ఇతర వస్తువులు పట్టుబడటంతో పోలీసులు సీజ్ చేశారు. ఎటువంటి రసీదు లేని వాటిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. చందానగర్ పరిధిలోని తారానగర్‌లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 5.65 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, నిజాం కాలేజీ వద్ద తనిఖీల్లో 7 కిలోల బంగారం, 300 కిలోల వెండి సీజ్ చేసినట్లు సమాచారం. షేక్‌పేట్ నారాయణమ్మ కాలేజీ వద్ద రసీదు లేకుండా తరలిస్తున్న రూ. 30 లక్షల సీజ్ అయ్యాయి. ేఎన్నికలు ముగిశాక సరైన ఆధారాలతో వాటిని తిరిగి పొందే అవకాశం ఉంది.