Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం సూచనలు.. కచ్చితంగా పాటించాల్సిందే
ఈ వార్తాకథనం ఏంటి
ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం పూర్తిచేసింది.
మొదటి విడతలో, ఇంటి స్థలం ఉన్నవారికి, ఇల్లు నిర్మించుకునే అవకాశం కలిగినవారికి ప్రాధాన్యత ఇచ్చింది.
ప్రతి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం అందిస్తున్న ప్రభుత్వం, ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా మంజూరు చేయనుంది.
ఇదే సమయంలో, కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను సూచించింది.
వివరాలు
ప్రతి ఇంటిపైనా మూడు రంగుల గుర్తు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ సమయంలో మూడు రంగుల గుర్తింపుపై పెద్దగా దృష్టి పెట్టలేదు.
కొన్నింటికి మాత్రమే మూడు రంగుల గుర్తులు అమలు చేయగా, మరికొన్నింటిలో అది లేదు.
కానీ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన ప్రతి ఇంటిపైనా మూడు రంగుల గుర్తును తప్పనిసరిగా ఉంచాలని నిర్ణయించింది.
ఇంటి యాజమానుల అభిప్రాయానికి సంబంధం లేకుండా, అన్ని ఇళ్లపై ఈ గుర్తులు ఉండాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
వివరాలు
బండి సంజయ్ విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వ ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు.
ప్రధాని ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్లకు 'ఇందిరమ్మ' పేరు పెడితే, కేంద్రం నుండి ఒక్క పైసా కూడా రాదని హెచ్చరించారు.
మోదీ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెట్టడం సమంజసం కాదని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులతో నిర్మించిన ప్రతి ఇంటిపై ఆ పథకం అధికారిక లోగో తప్పకుండా ఉండాలని కేంద్రం ఆదేశించింది.
కేంద్రం ఎన్ని ఇళ్లకు నిధులు అందిస్తుందో, అన్ని ఇళ్లపై ఈ గుర్తు ఉండాలని స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది.