Page Loader
Central Cabinet Meeting:నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు గ్రీన్ సిగ్నల్?
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు గ్రీన్ సిగ్నల్?

Central Cabinet Meeting:నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు గ్రీన్ సిగ్నల్?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2025
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త ఆదాయపన్ను బిల్లుపై చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే క్రమంలో, ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే స్పష్టంచేశారు. దీంతో వచ్చే వారం పార్లమెంటులో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. 1961లో అమలులోకి వచ్చిన ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టానికి బదులుగా, కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది.

Details

పన్ను భారం పెరగకుండా ఉండేందుకు చర్యలు

ఈ మేరకు, కొత్త బిల్లులో దీర్ఘ వాక్యాలు, సంక్లిష్ట నిబంధనలు, క్లిష్టమైన వివరణలు ఉండబోవని ఆర్థిక కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే తెలిపారు. ఈ శుక్రవారం జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుపై చర్చించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టే ఈ బిల్లులో ఆదాయపు పన్ను రేట్లు, స్లాబ్‌లు, TDS నిబంధనల్లో ఇటీవలి మార్పులు ప్రతిబింబిస్తాయని పాండే తెలిపారు. అదనంగా పన్ను భారం పెరగకుండా ఉండేలా ఈ బిల్లును రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు. చట్టాలు కేవలం న్యాయ నిపుణులకే కాకుండా సామాన్య పౌరులు సైతం సులభంగా అర్థం చేసుకునేలా సరళమైన భాషలో రూపొందించామని కూడా వివరించారు.