KISHAN REDDY: బాటసింగారం వెళ్తుండగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మళ్లీ క్రియాశీలకంగా మారుతోంది. ఈ మేరకు పోలీసుల వైఖరిని నిరసిస్తూ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్‌రెడ్డి భారీ వర్షంలోనే బైఠాయించారు. బాటసింగారంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించాలని భాజపా నిర్ణయించింది. ఈ క్రమంలో కిషన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే రఘునందన్ శంషాబాద్ నుంచి బయలుదేరారు. దీనికి అనుమతి లేదన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి వర్షంలో తడుస్తూనే రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన తెలియజేశారు. అనుమతి లేకుండా ఆందోళనలు చేపట్టకూడదని రాచకొండ సీపీ చౌహాన్ అన్నారు. అయితే అనుమతుల్లేకుండా భారాస నేతలు రోడ్లపై ధర్నాలు ఎలా చేస్తున్నారని రఘునందన్ ప్రశ్నించారు. అనంతరం ఇరువురి నేతలను అదుపులోకి తీసుకుని నాంపల్లి బీజేపీ ఆఫీసుకు తరలించారు.