LOADING...
Anantapur: అనంతపురంలో సిద్ధమైన సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రాంగణం.. నేడు లాంఛనంగా ప్రారంభం
అనంతపురంలో సిద్ధమైన సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రాంగణం.. నేడు లాంఛనంగా ప్రారంభం

Anantapur: అనంతపురంలో సిద్ధమైన సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రాంగణం.. నేడు లాంఛనంగా ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర విభజన అనంతరం అనంతపురం జిల్లాలోని జంతులూరు వద్ద సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ యూనివర్శిటీ కోసం మొత్తం 492 ఎకరాల భూమిని కేటాయించారు. భవనాలు,మౌలిక వసతుల నిర్మాణానికి రూ.711 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ప్రారంభ దశలో అనంతపురం నగర శివారులో అద్దె భవనాల్లో తాత్కాలికంగా తరగతులను నిర్వహించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యూనివర్సిటీ అభివృద్ధిని పట్టించుకోకుండా విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం మొదటి విడతగా విడుదల చేసిన రూ.350 కోట్ల నిధులతో 2023లో ప్రారంభించిన నిర్మాణ కార్యక్రమాలు.. రెండు అకడమిక్ భవనాలు,మూడు వసతిగృహాలు,పరిపాలనా భవనం, అంతర్గత రహదారులు,విద్యుత్ సరఫరా,తాగునీటి పథకాలు,సౌర విద్యుత్ ప్లాంట్.. పనులు నత్తనడకన సాగాయి

వివరాలు 

గత ఏడాది ఆగస్టు తరగతులు ప్రారంభం 

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రెండు ప్రధాన భవనాలను త్వరితగతిన పూర్తి చేయించారు. గత ఏడాది ఆగస్టు నుంచి 1,100 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమయ్యాయి. వీరికి అవసరమైన వసతులు కూడా అందించారు.ప్రస్తుతం శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయింది. 2,200 మంది విద్యార్థులు ఈ వర్సిటీలో చదివేలా ఏర్పాట్లు చేశారు.ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు చెందిన 1,600 మంది విద్యార్థులు,విదేశాలకు చెందిన 50 మంది విద్యార్థులు యూనివర్సిటీలో చదువుతున్నారు. ఈ యూనివర్శిటీ ప్రాంగణానికి 'జ్ఞానసీమ' అనే పేరు పెట్టారు. ఈ భవన సముదాయాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం నాడు ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారని యూనివర్సిటీ ఉపకులపతి కోరి వెల్లడించారు.