Page Loader
Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ వెకేషన్ బెంచ్‌కు బదిలీ
చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వెకేషన్ బెంచ్‌కు బదిలీ

Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ వెకేషన్ బెంచ్‌కు బదిలీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2023
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌‌ను ఇవాళ హైకోర్టు (High Court) విచారించింది. పిటిషన్ విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేయాలని చంద్రబాబు తరుపు న్యాయవాదులు కోరారు. వారి విన్నపం మేరకు న్యాయమూర్తి వెకేషన్ బెంచ్‌కు విచారణను బదిలీ చేశారు. మరోవైపు వచ్చే వాయిదా నాటికి చంద్రబాబు మెడికల్ రిపోర్టులను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వం తరుపు న్యాయవాదులను ఆదేశించారు. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్‌పై విచారణను దసరా సెలవుల్లో హైకోర్టు వెకేషన్ బెంచ్ చేపట్టనుంది.

Details

మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరిన లాయర్ సిదార్థ్ లూద్రా

చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆయన తరుఫు లాయర్ సిదార్థ్ లూథ్రా కోరారు. ఈ కేసులో నిందితులు బెయిల్‌పై ఉన్నారని, గడిచిన 40 రోజుల్లో దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పారు. అదే విధంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోరారు.