Page Loader
Chandrababu: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. పీ-4 అమలుకు రాష్ట్రస్థాయి సొసైటీ ఏర్పాటు
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. పీ-4 అమలుకు రాష్ట్రస్థాయి సొసైటీ ఏర్పాటు

Chandrababu: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. పీ-4 అమలుకు రాష్ట్రస్థాయి సొసైటీ ఏర్పాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2025
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పీ-4 కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధృడ నిర్ణయం తీసుకున్నారు. ఈ లక్ష్యంతో రాష్ట్రస్థాయిలో సీఎం ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ ఓ ప్రత్యేక సొసైటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జీరో పావర్టీ,పీ-4 కార్యక్రమాలపై జరిగిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో మార్గదర్శకుల ఎంపికను కలెక్టర్లు,మంత్రులు,ఎమ్మెల్యేలచే జరగేలా ఒక నిర్మితమైన వ్యవస్థను రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆగస్టు 15 నాటికి మొత్తం ఐదు లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే విధంగా ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవ్వేందుకు మిలాప్‌,డొనేట్ కార్డ్‌,రంగ్ దే వంటి సంస్థల సహాయాన్ని తీసుకోవాలని కూడా సమీక్షలో స్పష్టం చేశారు.